సౌత్ ఇండస్ట్రీస్ లో ఇప్పటికీ హీరోయిన్ గా తన ప్రస్థానాన్ని కంటిన్యూ చేస్తున్నారు అందాల త్రిష. తెలుగు సంగతి ఎలా ఉన్నా… తమిళ, మలయాళ చిత్రాల్లో ఆమెకు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. స్టార్ హీరోల సరసన గ్లామరస్ పాత్రల్ని తగ్గించేసి కాన్సెప్డ్ బేస్డ్ చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ.. తన జెర్నీని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకి ఓ అరుదైన గౌరవం దక్కింది.
అది అలాంటిలాంటి గౌరవం కాదు. ఇండియన్ స్ర్కీన్ మీదే ఇప్పటి వరకూ ఏ కథానాయికకూ ఇది వరకు దక్కని గౌరవం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చాలా తక్కువ మందికి మాత్రమే జారీ చేసే గోల్డెన్ వీసా త్రిష సొంతం చేసుకున్నారు. ఈ వీసాను అందుకున్న తొలినటిగా ఆమె నిలిచారు. ప్రస్తుతం అబుదాబీ ప్రభుత్వం సినిమా రంగాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలో ఉంది.
ఇందులో భాగంగా.. స్థానికంగానే కాకుండా అంతర్జాతీయంగా కొత్త టాలెంట్ ను ప్రోత్సహించే ప్రయత్నం ప్రారంభించింది. అలాంటి వారికి గోల్డెన్ వీసాలను జారీ చేయడం ద్వారా తమ దేశంతో దగ్గరి సంబంధాలుండేలా ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే త్రిషకి గోల్డెన్ వీసా దక్కింది. ఇప్పటి వరకూ మలయాళ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ కి, ప్రముఖ గాయని చిత్రకి ఈ గౌరవం దక్కింది. ఈ సందర్బంగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ త్రిష దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.