దేశీయ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాక్సిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర వినియోగ అనుమతి లభించింది!! అంతర్జాతీయ దిగ్గజ ఫార్మా సంస్థలతో పోటీ పడి.. వారికి దీటుగా అత్యంత వేగంగా టీకా తయారుచేసినా రకరకాల రాజకీయాల కారణంగా ఇన్నాళ్లుగా లభించని డబ్ల్యూహెచ్‌వో ఆమోదం ఎట్టకేలకు పండగ వేళ లభించింది. బుధవారంనాడు సమావేశమైన డబ్ల్యూహెచ్‌వో ‘సాంకేతిక సలహాదారుల బృందం’.. ఈ టీకాకు ‘ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్’ హోదా ఇవ్వాలని నిర్ణయించింది. అనంతరం ఆ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించింది.
