ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతిపై బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో బుధవారం సాయంత్రం గుర్తు తెలియని ఇద్దరు దుండగులు దాడికి పాల్పడ్డారు. చెన్నై నుంచి విమానం దిగి బాడీగార్డులతో కలసి నడిచి వెళుతున్న ఆయన్ను అకస్మాత్తుగా వెనుక నుంచి ఒక వ్యక్తి ఎగిరి తన్నాడు.
అదే సమయంలో మరోవ్యక్తి కూడా దాడికి ప్రయత్నించాడు. తక్షణం వారిని అడ్డుకున్న బాడీగార్డులు అప్రమత్తమై విజయ్‌ను సురక్షితంగా తీసుకెళ్లారు. ఈ ఘటనపై బెంగళూరు ఎయిర్‌పోర్ట్ పోలీ్‌సస్టేషన్‌లో విజయ్ ఫిర్యాదుచేశారు.
పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న ఆయనపై దాడికి కారణాలు తెలియరాలేదు. ఎయిర్‌పోర్టు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.