టీమ్ ఇండియా హెడ్‌కోచ్‌గా బీసీసీఐ రాహుల్ ద్రవిడ్‌ను నియమించింది. న్యూజీలాండ్‌తో జరిగే సిరీస్ నుంచి ద్రవిడ్ భారత జట్టుకు హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తారు. సులక్షణా నాయక్, ఆర్పీ సింగ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. రవిశాస్త్రి పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది.
