జాతీయస్థాయిలో వైద్య విద్యాప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)లో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. గతేడాది 135 మంది విద్యార్థులు నీట్‌లో అర్హత సాధించగా.. ఈ సారి ఏకంగా 305 మంది ఉత్తీర్ణులయ్యారు.
గతేడాది 35 మంది సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అర్హతను సాధించగా.. ఈ ఏడాది ఏకంగా 65 మంది వివిధ రిజర్వేషన్ క్యాటగిరీల్లో ర్యాంకులను సొంతం చేసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కార్పొరేట్ స్థాయి విద్య, ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకున్న నిరుపేద విద్యార్థులు.. తమ కలలను సాకారం చేసుకున్నారు. గతేడాది కంటే అత్యధిక సంఖ్యలో గురుకుల విద్యార్థులు నీట్‌లో ర్యాంకులు సాధించడంపై షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తంచేశారు.