తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో పొలిటికల్ ఎఫైర్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. కాగా పీఏసీ సమావేశానికి హాజరైన సీనియర్ నేత జానారెడ్డి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు.
నల్గొండలో స్నేహితుడి అంత్యక్రియలకు వెళుతున్నట్లు ఆయన చెప్పారు. ‘‘ప్రతి సారి సమావేశానికి రాను.. నా అవసరం ఉన్నప్పుడే వస్తా’’ అంటూ వెళ్లిపోయారు. రాష్ట్ర ప్రజలకు జానారెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు పీఏసీ సమావేశంలో హుజురాబాద్ ఫలితంపై సమీక్ష, వరి సాగు, నిరుద్యోగ సమస్యలపై నేతలు చర్చించనున్నారు.