తెలంగాణలో నిన్న మంగళవారం ఫలితాలు విడుదలైన హుజురాబాద్ ఉప ఎన్నికలో 3112 ఓట్లకే ఎందుకు పరిమితమైంది? కాం గ్రెస్‌కు సంస్థాగతంగా ఉన్న ఓటింగ్ అంతా ఎక్కడికి పోయింది? రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఇప్పుడు ఈ ప్రశ్న అనేక ఊహాగానాలకు తెర తీస్తున్నది. శత్రువు శత్రువు మిత్రుడైనట్టు.. ఢిల్లీలో పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమని మండిపోయే బీజేపీ కాంగ్రెస్‌లు.. హుజూరాబాద్ ఎన్నికల్లో చెట్టపట్టాలేసుకొని తిరిగాయ ని, తద్వారా కాంగ్రెస్ ఓట్లు సాలీడ్‌గా బీజేపీకి పడ్డాయని పలువురు విశ్లేషిస్తున్నారు. ఈటల రాజేందర్ ఉభయ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నారని ఎన్నికలకు చాలారోజుల ముందు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కే తారకరామారావు చేసిన వ్యాఖ్యలు వాస్తవాలని మంగళవారం నాటి ఫలితం తేల్చిచెప్పిందని అం టున్నారు.
కాంగ్రెస్ ఎన్నడూ లేదు
133 ఏండ్ల చరిత్రగల కాంగ్రెస్.. మునుపెన్నడూలేని విధంగా బీజేపీతో భు జం భుజం కలిసి దగ్గరుండి మరీ తన ఓటును బీజేపీకి బదలాయించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ 2767 ఓట్లు మా త్రమే సాధించారు. డిపాజిట్ దక్కాలంటే కనీ సం 12 వేల ఓట్లు సాధించాలి. కానీ మార్జిన్ ఓట్లు కూడా సాధించలేక డిపాజిట్ కోల్పోయా రు. తన అభ్యర్థిని చివరి నిమిషంలో అదీ స్థానికేతరుడిని ప్రకటించటంతోనే కాంగ్రెస్ రంగు తేటతెల్లమైంది. హుజూరాబాద్‌లో మిగతా పార్టీలు వాడివేడిగా ప్రచారం చేస్తున్న సమయంలో పీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అక్కడ మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ అభ్యర్థికి ఓటెయ్యాలని బాహాటంగానే ప్రచారం నిర్వహించారన్న విమర్శలు ఉన్నాయి. హుజూరాబాద్ ఫలితాల్లో ఏ ఒక్క రౌండ్‌లో కూడా చెప్పుకోదగ్గ ఓట్లు రాకపోవడమే ఇందుకు తార్కాణం. తమ పార్టీకి ఇంత దారుణంగా ఓట్లు రావడంతో తలెత్తుకొని తిరగలేకపోతున్నామని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర మథనంలో పడ్డారు. అదే సమయంలో పార్టీ సీనియర్ నేతలు పలువురు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే.. కాంగ్రెస్‌లో రచ్చ మొదలైందని అర్థమవుతున్నది.
సంవత్సరం : కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు
2009 : 41,717 ఓట్లు
2014 : 38,278 ఓట్లు
2018 : 61,121 ఓట్లు
2021 : 3112 ఓట్లు
రేవంత్‌రెడ్డి కథ తేలుస్తా
హుజూరాబాద్ ఫలితం కాంగ్రెస్‌కు పెద్ద అవమానం. గత ఎన్నికల్లో 40 వేలు, 60 వేల ఓట్లు వ చ్చాయి. ఈసారి 3 వేల ఓట్లే రావడం బాధాకరం. బీజేపీ గెలవలేదు. ఈటల గెలిచారు. కాంగ్రెస్‌కు ప్రధాన శత్రువైన బీజేపీ గెలుపునకు మా పార్టీలోనే కొందరు పరోక్షంగా సహకరించారు. స్థానిక నాయకులను ఎందుకు ఎంపిక చేయలేదు? ముందుగా అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదు? రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క కలిసి వెంకట్‌ను బలి పశువును చేశారు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత పీసీసీ అధ్యక్షుడిదే. ఇదే అభ్యర్థిని నాలుగు నెలల ముందే ఎందుకు పెట్టలేదు? ఇతర పార్టీలు ఖర్చు పెడుతున్నప్పుడు ఒక రూ.20 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఏం తమాషా ఇదంతా? మహేశ్‌గౌడ్ కథ, రేవంత్‌రెడ్డి కథ తేల్చేస్తా. రెండ్రోజుల ముందు ఎవడైనా క్యాండిడేట్‌ను డిక్లేర్ చేస్తరా? ఏమైనా బుద్ధి ఉన్నదా? ఒక్కదానికే వీళ్లు తట్టుకోలేదు.. ఇక వందకు ఈ మొహాలు ఏం తట్టుకుంటాయి? నేను హుజూరాబాద్ ఇంచార్జిగా ఉన్నా.. అసలు క్యాండిడేట్‌ను ప్రకటించిం ది నాకే తెలియదు. బుధవారం జరిగే సమావేశంలో అన్ని విషయాలపై ప్రశ్నిస్తా. – తూర్పు జగ్గారెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్
ఈటలకు మద్దతు ఇవ్వక తప్పలేదు
హుజూరాబాద్ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ ఈటల రాజేందర్‌కు మద్దతివ్వక తప్పలేదు. మేం గట్టిగా పోరాడితే ఓట్లు చీలి, టీఆర్‌ఎస్‌కి లాభం జరిగి ఉండేది. అతి తక్కువ ఓట్లు రావడానికి పార్టీ ముఖ్యులే కారణం. క్యాడర్ ఉన్నా ఓట్లు వేయించుకోవడంలో విఫలమయ్యాం. ఎన్నికలపై వాస్తవ పరిస్థితులను హైకమాండ్‌కు వివరిస్తా.
-కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ
ఈటల గెలవాలని బండి సంజయ్ కోరుకోలేదు
ఈటల గెలవాలని బండి సంజయ్ కోరుకోలేదు. ఇది బీజేపీ విజయం కానే కాదు. బీజేపీ విజయమంటూ బండి సంజయ్ చెప్పుకోవడం దురదృష్టకరం. ఈటల గెలవాలనే ఉద్దేశం బీజేపీకి ఉన్నట్టు ఎక్కడా కనిపించలేదు. ఈటల కూ డా తాను బీజేపీ అభ్యర్థినని చెప్పలేదు. బీజేపీ పొడిసిందేమీ లేదు. కాంగ్రెస్ ఓటమి ఊహించిందే. అప్పుడు ఉత్తమ్ నష్టంచేశారు. రేవంత్ దానిని భర్తీచేయలేదు. – పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నేత