పశ్చిమ బెంగాల్ లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తృణమూల్ పార్టీ దుమ్మురేపుతోంది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ ఆ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్లుతోంది. అధికార తృణమూల్ పార్టీకి బీజేపీ ఇవ్వలేకపోయింది.
కూచ్‌బిహార్ జిల్లాలోని దిన్‌హటా స్థానంలో టీఎంసీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బీజేపీ స్థానమైన దిన్‌హటాలో ఈసారి టీఎంసీ తరపున ఉదయన్ గుహ పోటీలో నిలిచారు. అయితే బీజేపీ అభ్యర్తి అశోక్ మండల్‌పై .. ఉదయన్ సుమారు లక్షన్నర ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.
15 రౌండ్లు పూర్తి అయ్యేవరకు గుహకు 1,51,163 ఓట్లు పోలయ్యాయి. ఇక అశోక్‌కు 19,562 ఓట్లు పడ్డాయి. గోసాబా అసెంబ్లీ నియోజకవర్గంలోనూ టీఎంసీ భారీ మెజారిటీతో వెళ్తోంది.
సంతీపూర్ అసెంబ్లీ స్థానంలోనూ టీఎంసీ నేత బ్రజా కిషోర్ గోస్వామి లీడింగ్‌లో ఉన్నారు. ఖార్దా అసెంబ్లీ స్థానంలో మంత్రి సోవన్‌దేవ్ చటోపాధ్యాయ ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఆయనకు 46వేల ఓట్ల మెజారిటీ దక్కినట్లు తెలుస్తోంది.