యంగ్ హీరోయిన్ రితికా సింగ్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. లేడీ డైరెక్టర్ సుధ కొంగర దర్శకత్వంలో వచ్చిన ‘ఇరుదు సుట్రు’ మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇదే సినిమా హిందీలో అలాగే తెలుగులో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘గురు’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.
ఈ క్రమంలో రితిక టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటించిన ‘శివ లింగ’ సినిమాలో హీరోయిన్‌గా నటించి మంచి హిట్ అందుకుంది. కానీ ఎందుకనో తనకు సౌత్‌లో వరుసగా ఆఫర్స్ రావడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికి తన లేటెస్ట్ ఫొటోషూట్ పిక్స్‌ను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.
అలాగే మేకర్స్ దృష్ఠిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రితిక శారీలో తీసుకున్న లేటెస్ట్ పిక్స్‌ను తన ఇన్స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకుంది. చూడగానే ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్ కూడా వావ్ అంటున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చూడాలి మరి ఈ లేటెస్ట్ ఫొటోషూట్ పిక్స్ మేకర్స్‌ను ఆకట్టుకొని ఏదైనా సినిమా ఛాన్స్ వస్తుందేమో.