‘‘పునీత్ రాజ్‌కుమార్ మంచి నటుడే కాదు నాకు మంచి మిత్రుడు కూడా. సినీ పరిశ్రమకే కాదు… సమాజానికి ఆయన మృతి తీరని లోటు. 1800 మంది పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించడంతో పాటు అనాథాశ్రమం, వృద్ధాశ్రమం నడిపిన గొప్ప మనసు పునీత్‌ది.
మిత్రుడుగా నీ సేవాకార్యక్రమాలను నేను కొనసాగిస్తాను. ఇకపై ఆ 1800 మంది పిల్లలకు చదువు చెప్పించడంతో పాటు వారి బాగోగులు నేను చూసుకుంటాను’’ అని హీరో విశాల్ అన్నారు. ఆయన హీ రోగా, ఆర్య ప్రతినాయకుడిగా నటించిన ‘ఎనిమి’ చిత్రం నవంబరు 4న థియేటర్లలో విడుదలవుతోంది. ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఆర్య మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కథ రొటీన్ స్టోరీలా ఉండదు. స్నేహితులు శత్రువులుగా మారడం అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. దర్శకుడు ఆనంద్ శంకర్ అద్భుతంగా తెరకె క్కించారు’’ అన్నారు. మమతామోహన్ దాస్ మాట్లాడుతూ ‘‘యమదొంగ’ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ‘ఎనిమి’లో నా క్యారెక్టర్ ఆడియన్స్‌కు సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది’’ అన్నారు.