దగ్గుబాటి ఫ్యామిలీ హీరో రానా(Rana) ఏ మాత్రం తగ్గట్లేదు. హీరోగానే కాకుండా విలన్‌గాను, హోస్ట్‌గాను, ప్రమోటర్‌గాను వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్రంలో నెగెటివ్ రోల్ పోషిస్తున్న రానా ఇప్పుడు సోనీ లీవ్ ఓటీటీ ని ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చాడు.
ఉత్తరాదిన మంచి ఆధరణ దక్కించుకున్న సోనీ లీవ్(sony Liv) ఓటీటీని సౌత్ లో విస్తరించేందుకు గాను పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందులో సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు ప్రసారం చేయనున్నారు. అయితే సౌత్‌లోను దీనిని విస్తరించేందుకు గాను రానా సాయం తీసుకున్నారు నిర్వాహకులు. రానా సోనీ లీవ్ ప్రమోషన్ కోసం కమర్షియల్ యాడ్ లో నటించాడు.
అందులో డబ్ల్యూ డబ్ల్యూ ఈ ఆర్టిస్టుగా రానా కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు ఏ సౌత్ హీరో కూడా ఇలాంటి ప్రయోగాన్ని చేయలేదు. మొదటి సారి రానా నుండి ఇలాంటి ప్రయోగం రాబోతున్న నేపథ్యంలో అంతా కూడా ఆశ్చర్యంగా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక రానా సినిమాల విషయానికి వస్తే ఒక వైపు విరాట పర్వం సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.