దేశంలో చమురు మంటలు కొనసాగుతున్నాయి. వరుసగా ఐదో రోజూ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరు పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచాయి.
దీంతో న్యూఢిల్లీలో పెట్రోల్ ధర రూ.109.34, డీజిల్ రూ.98.07కు చేరాయి. అదేవిధంగా ముంబైలో పెట్రోల్ రూ.115.15, డీజిల్ రూ.106.23, కోల్‌కతాలో పెట్రోల్ రూ.109.79, డీజిల్ రూ.101.19, చెన్నైలో పెట్రోల్ రూ.106.04, డీజిల్ రూ.102.25కు పెరిగాయి.ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 39 పైసల చొప్పున పెరిగాయి. దీంతో లీటర్ పెట్రోల్ రూ.113.72కు చేరగా, డీజిల్ రూ.106.99కు పెరిగాయి.