హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్ తెలిపారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు 86.33 శాతం పోలింగ్ నమోదైందని, తుది నివేదికల తర్వాత మరింత పెరిగే అవకాశమున్నదని చెప్పారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమలాపూర్‌లో 224, 225 పోలింగ్‌కేంద్రాల్లో సమయం దాటిన తర్వాత కూడా ఓటర్లు బారులు తీరారని చెప్పారు.
పోలిం గ్ ముగిశాక పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీల్‌వేసి కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కాలేజీ స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచామన్నారు. స్ట్రాంగ్‌రూంకు చుట్టూ 19 కంపెనీల పారామిలిటరీ బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటుచేశామని వివరించారు.
ఈవీఎంలను పోటీచేసిన అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్‌రూంలో పెట్టిన తరువాత ఆ గదికి సీల్‌వేసి కౌంటింగ్ రోజు అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో తెరుస్తామన్నారు. ఈ స్ట్రాంగ్ రూం, పరిసరాల్లో 24 గంటల నిఘా ఉంటుందని అన్నారు. ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు డబ్బులు పంపిణీచేశాయనే ఫిర్యాదు అందాయని, వీటిపై విచారణ చేపడతామని చెప్పారు. రూ.3.6 కోట్ల విలువైన నగదు, మద్యం సీజ్‌చేశామని తెలిపారు.