‘ఆప్ ఓట్ కర్‌నే కే లియే జా రహే హైనా.. జరా గ్యాస్ సిలిండర్ కో నమస్కార్ కర్‌కే జావో’.. 2014 సార్వత్రిక ఎన్నికల సభల్లో కనపడ్డ ప్రతి మైకులోనూ మోదీ ప్రజలకు ఇచ్చిన పిలుపు ఇది. అప్పుడు సిలిండర్ ధర సుమారు రూ.410 ఉన్నది. ఆ ధరే ఎక్కువంటూ మోదీ తెగ బాధపడిపోయారు.
ఇది 2021. ఇవాళ గ్యాస్ ధర రూ.వెయ్యి దగ్గర్లోకి చేరింది. ఇప్పుడు ఓటర్లు సిలిండర్‌కు ఎన్ని దండాలు పెట్టాలో మరి..! హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో నాటి మోదీ వీడియోక్లిప్‌ను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మంగళవారం ట్వీట్‌చేశారు.
‘ఒక్కోసారి ఉత్తమ సలహాలు అనూహ్య ప్రాంతాల నుంచి వెలువడుతాయి. పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా ప్రజలు ఎన్నికల రోజు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌కు నమస్తే పెట్టి ఓటేయాలంటూ సాక్షాత్తూ ఈ దేశ ప్రధాని ఇచ్చిన పిలుపును స్వీకరించి.. సిలిండర్‌కు దండంపెట్టి పోలింగ్‌బూత్‌కు వెళ్లి కారు గుర్తుకు ఓటేయాల’ని ఓటర్లను కోరారు