Home / SLIDER / దేశానికి ఆదర్శంగా నిలిచేలా రైతు సంక్షేమ పథకాలు

దేశానికి ఆదర్శంగా నిలిచేలా రైతు సంక్షేమ పథకాలు

 దేశానికి ఆదర్శంగా నిలిచేలా సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో రైతు సంక్షేమ పాలన కొనసాగిస్తున్నారని ప్రజాతినిధులు పేర్కొన్నారు. జిల్లాలోని పలుచోట్ల మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం విముఖంగా ఉన్నప్పటికీ, రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్‌ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.సిరికొండ మండలం పెద్దవాల్గోట్‌, కొండూర్‌, సర్పల్లితండా గ్రామాల్లో సహకార సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌ స్థానిక జడ్పీటీసీ మలావత్‌ మాన్‌సింగ్‌ కలిసి ప్రారంభించగా, ధర్పల్లి మండలం సీతాయిపేట్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో, గుడితండాలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ నల్ల సారికాహన్మంత్‌రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ సహకారంతో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నారు.ఇందల్వాయి మండల కేంద్రంతో పాటు ఇందల్వాయి తండా, త్రయంబక్‌పేట్‌, రంజిత్‌నాయక్‌ తండా, చంద్రాయన్‌పల్లి గ్రామాల్లో ఏర్పాటు కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్‌ చింతలపల్లి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీపీ రమేశ్‌ ప్రారంభించారు. జక్రాన్‌పల్లి మండలం బ్రాహ్మణ్‌పల్లి సహకార సొసైటీ ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ డీకొండ హరిత ప్రారంభించారు.

డిచ్‌పల్లి మండలం దూస్‌గాంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని విండో చైర్మన్‌ గజవాడ జైపాల్‌తో కలిసి ఎంపీపీ గద్దె భూమన్న, కోటగిరి మండలం పొతంగల్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని విండో చైర్మన్‌, డీసీసీబీ డైరెక్టర్‌ శాంతేశ్వర్‌పటేల్‌ ప్రారంభించారు.ఎడపల్లి అంబం(వై) గ్రామంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బోధన్‌ ఏఎంసీ చైర్‌పర్సన్‌ అర్చనాసూర్యకాంత్‌, ఎంపీపీ శ్రీనివాస్‌, సర్పంచ్‌ గంగాప్రసాద్‌, నవీపేట మండలం నాగాపూర్‌ సొసైటీలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ సంగెం శ్రీనివాస్‌, విండో చైర్మన్‌ శైలేష్‌కుమార్‌ ప్రారంభించారు. వేల్పూర్‌ మండలం పచ్చలనడ్కుడలో కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొట్టాల చిన్నారెడ్డి ప్రారంభించారు. ముప్కాల్‌ మండలం రెంజర్ల సొసైటీలో ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్‌ కోమటిశెట్టి గంగాధర్‌ ప్రారంభించారు. మాక్లూర్‌ మండలం వేణుకిసాన్‌నగర్‌ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్‌ రమేశ్‌నాయక్‌, ఎంపీటీసీ లలిత ప్రారంభించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat