గూగుల్‌కు గుండెకాయ..అమెజాన్‌కు ఆయువుపట్టుగా హైదరాబాద్ మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ కట్టుకథలకు పెట్టుబడులు రావన్నారు.
‘‘పరిశ్రమలు అంటే టాటా బిర్లాలు కాదు…కులవృత్తులు కూడా కుటీర పరిశ్రమలే. ఏడున్నర ఏళ్ల ప్రస్థానంలో తెలంగాణలో స్వర్ణయుగం. ధరణి ఒక సంచలనం. దేశానికి దిక్సూచిగా మారింది. టీఆర్ఎస్ తెచ్చిన ప్రతి చట్టం తెలంగాణ ప్రజలకు చుట్టం. కేసీఆర్ అంటే కాలువలు..కుంటలు..చెరువులు.’’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.