ఇన్నాళ్లు హీరోయిన్‌గా అలరించిన తమన్నా యాంకర్‌గాను తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే. తమన్నా భాటియా హోస్ట్‌గా మాస్టర్ చెఫ్ వంటల కార్యక్రమం జెమినీ టెలివిజన్‌లో ఆగస్టు 21వ తేదీన ప్రారంభమైంది. ఈ షోలో జడ్జీలుగా సంజయ్ తుమ్మ, మహేష్ పడాల, చలపతిరావు వ్యహరించారు. అయితే ఆరంభంలో ఈ షో మంచి రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది.
రాను రాను షోకి ఆదరణ దక్కకపోవడంతో తమన్నా స్థానంలో అనసూయని తీసుకున్నారు.అనసూయ రంగ ప్రవేశంతో ఈ షో మంచి రేటింగ్ సాధిస్తుందనే ఆశాభావంతో ప్రొడక్షన్ హౌస్ ఉన్నట్టు సమాచారం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రొడక్షన్ హౌస్‌కు తమన్నా షాకిచ్చింది. తనను తొలగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తమన్నా .. ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీపై తన లాయర్ చేత నోటీసులు పంపించారట. తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ప్రొడక్షన్ హౌస్‌కు నోటీసుల్లో పేర్కొన్నారు అని వెల్లడించింది.
2007లో తెలుగులో శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ సినిమా ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయిన తరువాత తమన్నా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని పడలేదు. రెడీ, 100 % లవ్, ఊసరవెల్లి, కెమెరామెన్ గంగతో రాంబాబు, రచ్చ, బాహుబాలి లాంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో చివరగా సీటీమార్, మాస్ట్రో సినిమాలో నటించి మెప్పించింది.