టీఆర్‌ఎస్ పార్టీ ద్విదశాబ్ది వేడుకలను పండుగలా జరుపుకుందామని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, పార్టీ నాయకులతో కలిసి హైటెక్స్‌లో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో 20 ఏండ్ల ప్రస్థానం గర్వించదగిన క్షణాలు అని చెప్పారు.
ఎంపీ సంతోష్‌కుమార్ వెంట ఎమ్మెల్సీ నవీన్ కుమార్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు ఉన్నారు.టీఆర్‌ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవ వేడుకలకు సర్వం సిద్ధమయింది. రేపు హైటెక్స్ వేదికకగా పార్టీ ప్లీనరీ జరగనుంది. ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు గులాబీదళం భారీ ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలకు ఆరు వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.
ప్రతినిధుల నమోదు కోసం 35 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి సెషన్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ జరగనుంది. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు ఇప్పటికే ప్రత్యేక పాసులు జారీచేశారు. సభా వేదిక చుట్టూ 8 పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లన్ని గులాబీమయమయ్యాయి.