లాటిన్ దేశం పెరూలో కోవిడ్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య రెండు లక్షలు దాటింది. ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో కొత్తగా 25 మంది మరణించారు.
దీంతో దక్షిణ అమెరికా దేశమైన పెరూలో మృతుల సంఖ్య రెండు లక్షలు దాటింది. మార్చి 2020 నుంచి ఆ దేశం కరోనా మరణాలను లెక్కిస్తున్నది. ఆ దేశంలో ఇప్పటి వరకు 22 లక్షల మందికి వైరస్ సంక్రమించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే, పెరూలో కోవిడ్ మరణాల రేటు అధికంగా ఉన్నది. పది లక్షల మందిలో ఆ దేశంలో ఆరు వేల మంది మరణిస్తున్నారు.