ఆత్మబంధువు – దళిత సంక్షేమ బంధం’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ప్రగతి భవన్లో ఆవిష్కరించారు. ఈ పుస్తకం కవి, రచయిత, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో రూపొందింది.
దళితబంధుపై జరుగుతున్న ప్రగతిశీల కృషినంతా ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు జూలూరి తెలిపారు. అనంతరం, తమ కుమార్తె వివాహానికి హాజరుకావాలని ముఖ్యమంత్రికి జూలూరు గౌరీశంకర్ దంపతులు శుభపత్రిక అందజేసి, ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మంత్రులు జి. జగదీశ్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే జి.విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.