ఇండియాలో గత 24 గంటల్లో 16,326 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 666 మంది కరోనాతో మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసుల సంఖ్య 1,73,728గా ఉంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.16 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాక చెప్పింది. మార్చి 2020 నుంచి ఇదే అత్యధికం. గత 24 గంటల్లో రికవరీ అయిన వారి సంఖ్య 17,677గా ఉంది. ఇక కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు 101.30 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు.