హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం అంకుషాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆర్థికమంత్రి హరీశ్‌రావుతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
గ్రామంలో గెల్లుకు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. డప్పు చప్పుళ్లతో గెల్లుకు స్వాగతం పలికారు. హరీశ్‌రావుతో పాటు పార్టీ నాయకుల మీద పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ అంకుషాపూర్ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్ తో మాట్లాడి ప్రత్యేకంగా 100కోట్ల రూపాయలు తీసుకొని వస్తా నన్నారు. నియోజకవర్గానికి 5 వేల రెండు పడకల ఇల్లు తీసుకొని రావడంతో పాటు, సొంత జాగలో ఇల్లు కట్టుకొనే ప్రతి కుంటుంబానికి 5 లక్షల4 వేల రూపాయలు ఇప్పిస్తానన్నారు.
అంకుషాపూర్ గ్రామంలో ఇల్లు లేని ప్రతి పేద కుటుంబా నికి ఇండ్లు కట్టించే బాధ్యత నాదేనని, నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చి ప్రజలకు ఉచిత వైద్యం అందించే విధంగా కృషి చేస్తానన్నారు.నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు