ఈటలరాజేందర్ కు ఓటమి భయం పట్టుకుంది. ఓడిపోతాననే ఫస్ట్రేషన్ లో నోటికి వచ్చినట్లు మాట్లాడు తున్నడు. అరేయ్.. ఓరేయ్ అంటున్నడు. కూలగొడత, కాలబెడతా అంటున్నాడని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. గురువారం వావిలాలలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటమి భయంతో ఈటల విపరీత వాఖ్యలు చేస్తున్నారని, ఫస్ట్రేషన్ లో నోరు జారి మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు.ఎన్నికలు వచ్చినప్పుడు ఏడేండ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏం పని చేసింది.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఏం పని చేసింది అన్నది చర్చ జరగాలి , ఇకముందు ఏం చేస్తామో చెప్పి ఓట్లు అడగాలి కానీ సానుబూతి మాటలు, రెచ్చగొట్టే మాటలు, పరుషపదజాలంతో మాట్లాడుతున్నారని అన్నారు. ఆయనకు బీజేపీ వాసన బాగా పట్టింది. బీజేపీ అంటే జూటేబాజ్, బట్టేబాజ్ పార్టీ అని హరీశ్‌రావు గాటుగా వివర్శించారు. వావిలాల మండలం కావాలని ఇక్కడి వారు 36 రోజులు నిరహార దీక్ష చేసారు. అయినా రాజేందర్ మనసు కరగలేదు.అరెస్టులు చేసాడు తప్ప మండలం ఇవ్వలేదు. మండలం కన్నా ఎక్కువ పని చేస్తా అన్నడు.
కానీ ఒక్క ఇళ్లువచ్చిందా, పశువుల దవాఖానా వచ్చిందా ? మాటలు తప్ప చేతల్లో జరిగిందేమి లేదని ఎద్దెవా చేశారు. గెల్లును అఖండమైన మెజా ర్టీతో గెలిపించండి. కేసీఆర్ కాళ్లు మొక్కయినా వావిలాల మండలం చేయిస్తా. ఇది ఉద్యమం జరిగిన గడ్డ. మండలం కోసం పోరాటం జరిగింది. ఎన్నికల కోడ్ అయ్యాక మండలాన్ని చేసుకుందాం. ఇది మీ చేతుల్లో ఉంది. గెల్లుపై సీఎం కు ప్రేమ ఉంది. గెల్లు, నేను కేసీఆర్ దగ్గరకు వెళ్లి మీ పోరాటం నిజం చేసే బాధ్యత తీసుకుంటాం అని హామీ ఇచ్చారు.