టీఆర్‌ఎస్ ప్లీనరీ అంటే రాజకీయ తీర్మానాలే కాదు రుచికరమైన వంటకాలకూ ప్రసిద్ధి. ఈ సారి సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ దగ్గరుండి మరీ మెనూ తయారు చేసి పసందైన వంటకాలను అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ మేరకు 29 రకాల వంటలకు సంబంధించి మెనూ ఫైనల్ చేశారు. పార్టీ ప్రతినిధులతో పాటు, పోలీసులు, గన్‌మెన్లు, డ్రైవర్లు, పాత్రికేయులు ఇలా 15 వేల మందికి సరిపడా వంటలు సిద్ధం చేస్తున్నారు.
నాన్‌వెజ్ వంటకాలే ఎక్కువ..
ఈసారి ప్లీనరీలో మాంసాహార వంటకాలనే ఎక్కువగా వడ్డించనున్నారు. ఫుడ్ కమిటీ ఇన్‌చార్జి మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఈసారి 29 రకాల వంటలను వండనున్నారు. ఒకేసారి 8 వేల మంది అతిథులు భోజనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీలతో పాటు ప్రజాప్రతినిధులు, మహిళలకు వేర్వేరుగా భోజనశాలలను సిద్ధం చేస్తున్నారు.
మెనూ ఇదే..
నోరూరించే రుచులు వడ్డిస్తాం
ప్లీనరీకి వచ్చే ప్రతినిధులు, కార్యకర్తలకు రుచికరమైన భోజనం అందిస్తాం. గతంలో రెండుసార్లు ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించా. ఈ సారి కూడా సీఎం కేసీఆర్ తిరిగి నాకే బాధ్యతలు అప్పగించారు. సుమారు 15 వేల మందికి వెజ్, నాన్‌వెజ్ వంటల రుచి చూపించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం చెయ్యి తిరిగిన 500 మందిని నియమిస్తున్నాం. వాలంటీర్లు, ప్రత్యేక సిబ్బందితో ఒకేసారి 8 వేల మంది భోజనాలు చేసేలా చూస్తున్నాం.
– మాధవరం కృష్ణారావు-MLA, ఫుడ్‌కమిటీ ఇన్‌చార్జి