బ్రిటన్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో గత ఎనిమిది రోజులుగా 40 వేలకుపైగా కేసులు నమోదవుతుండగా, తాజాగా ఆ సంఖ్య 52 వేలు దాటింది. యూకేలో గురువారం కొత్తగా 52,009 మంది కరోనా బారినపడ్డారు. మరో 115 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సఖ్య 86,41,221కి చేరగా, 1,39,146 మంది మృతిచెందారు.
కాగా, దేశంలో కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయని, పరిస్థితిని నిషితంగా గమనిస్తున్నామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. కరోనా మహమ్మారి ప్రమాదం ఇంకా తొలగిపోలేదన్నారు. దేశంలో 12 ఏండ్లు అంత కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు 86 శాతం మంది వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారని, సుమారు 79 శాతం మంది రెండు డోసులు అందుకున్నారని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.