నితిన్ సరసన కథానాయికగా `ధైర్యం` సినిమాతో తెలుగు తెరంగేట్రం చేసిన హీరోయిన్ రైమా సేన్ టాలీవుడ్‌లో సక్సెస్ కాలేకపోయింది. దాంతో బెంగాలీ, హిందీ సినిమాలపై దృష్టి పెట్టి అక్కడ మంచి గుర్తింపు సంపాదించుకుంది. 42 సంవత్సరాల రైమా సేన్ ఇటీవల వివాహం గురించి మాట్లాడింది. ఓ కార్యక్రమంలో పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తన మనసులోని మాటను బయటపెట్టింది.
`పెళ్లి చేసుకోని మహిళను ఇక్కడ గౌరవంగా చూడరు. పెళ్లి కాకపోతే ఆమె ఏదో విషాదంలో ఉంది అనుకుంటారు. నాకు సంబంధించినంత వరకు పెళ్లి అనేది తప్పక చేరుకోవాల్సిన గమ్యం కాదు. నాకు పెళ్లి అవసరం లేదు. నా డబ్బు నేను సంపాదించుకుంటున్నాను.
నేనే స్వేచ్ఛగా తిరుగుతాను. వేరొకరికి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదు. సంతోషంగా ఉన్నప్పుడు వేరే మార్పు గురించి ఎందుకు ఆలోచించాలి. భవిష్యత్తులో నాకు నచ్చిన వ్యక్తి దొరికితే పెళ్లి గురించి ఆలోచిస్తా. కచ్చితంగా పెళ్లి చేసుకోవాలనే కోరిక నాకు లేద`ని రైమా చెప్పింది.