దక్షిణాదిలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరుగా పేరు సంపాదించుకుంది నయన తార. చిన్నా పెద్ద అనే వ్యత్యాసం లేకుండా తన పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి సినిమాలను చేస్తోంది. తద్వారా నటిగా సక్సెస్‌ను అందుకుంటోంది. ఇక, బడా హీరోలకు ఆమె ఫస్ట్ ఛాయిస్ అవుతోంది. ఫలితంగా చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయిందీ. ఇక లవ్ ట్రాకుల విషయంలో ఏకంగా రెండు సార్లు విఫలమైన నయనతార ప్రస్తుతం విఘ్నేష్ శివన్ అనే దర్శకుడితో లవ్ ట్రాక్ నడపడం మొదలు పెట్టింది
కొద్ది రోజులుగా వీరి ప్రేమ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.వీరు పెళ్లి చేసుకుంటారా లేదా అనే అనుమానాలు అందరిలో ఉండగా,ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు విఘ్నేష్ శివన్‌తో నిశ్చితార్థం జరిగిందని చెప్పుకొచ్చింది.త్వరలోనే నయన్- విఘ్నేష్ శివన్ జంట పెళ్లి పీటలెక్కనున్నారు.అయితే ప్రస్తుతం నయనతార .. షారుక్ ఖాన్ సరసన నటిస్తున్న హిందీ చిత్రం షూటింగ్‌లో పాల్గొనడానికి ఇటీవలే పూణే వెళ్లింది.
షూటింగ్ గ్యాప్‌లో తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి షిర్డీ వెళ్లింది నయనతార. ఆ తర్వాత ముంబై చేరుకుని ముంబై దేవి, మహాలక్ష్మి, సిద్ధి వినాయక ఆలయాలను సందర్శించారు. అంతేకాదు.. నయన స్ట్రీట్ షాపింగ్ కూడా చేశారు. ఒక బ్యాగుని బేరం చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.