స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఇకపై తన ఫోకస్ మొత్తం పక్కా కమర్షియల్ సినిమాల మీదే పెట్టాలనుకుంటోందట. టాలీవుడ్‌లో ఆమెకు ‘మహానటి’ సినిమా తర్వాత వచ్చిన క్రేజ్ అసాధారణం. దాంతో ఆమె ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ మీద ఫోకస్ చేసింది. ఈ క్రమంలో ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’, ‘గుడ్ లక్ సఖి’ చిత్రాలను చేశారు.
అయితే గత ఏడాది విడుదలైన ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ సినిమాలు కీర్తిని తీవ్రంగా నిరాశపరచాయి. దాంతో ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ‘గుడ్ లక్ సఖి’ కూడా వాయిదా పడింది. అయితే ఆమెకి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అంతగా కలిసి రావడం లేదని గ్రహించి, ఇకపై పూర్తిగా కమర్షియల్ సినిమాలను మాత్రమే చేయాలని నిర్ణయించుకుందట.
ప్రస్తుతం కీర్తి మహేశ్ బాబుతో ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్‌లో పాల్గొంటుంది. ఇప్పటికే రజనీకాంత్ ‘అణ్ణాత్త’ సినిమాను పూర్తి చేసింది. ఇక త్వరలో మెగాస్టార్‌కి చెల్లెలిగా నటిస్తున్న ‘భోళా శంకర్’, నానితో ఇటీవలే కమిటైన ‘దసరా’ చిత్రాలు సెట్స్ మీదకు రానున్నాయి. అలాగే ‘గుడ్ లక్ సఖి’ నవంబర్‌లో రిలీజ్‌కు సిద్దమవుతోంది.