దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 231 రోజుల్లో ఇదే అత్యల్ప సంఖ్య. దేశవ్యాప్తంగా 19,470 మంది కరోనా నుంచి కోలుకోగా, గడిచిన 24 గంటల్లో 164 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ప్రస్తుతం యాక్టివ్ కేసులు దేశవ్యాప్తంగా 1,83,118 ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. ఇప్పటి వరకు భారత్‌లో వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,52,454గా ఉన్నది. ఇక కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 98.67 కోట్ల కోవిడ్ టీకా డోసులను ఇచ్చేశారు.