గతంలో మాదిరిగా అసెంబ్లీ ముందస్తు ఎన్నికలు వెళ్లే ఆలోచన లేదు. మన ప్రభుత్వానికి ఇంకా రెండున్నరేండ్ల సమయం ఉన్నది. ఈలోపు మనం చేయాల్సిన పనులున్నాయి. వీటిని పూర్తి చేసుకుందాం. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో మనమే కీలకపాత్ర పోషించేస్థాయికి ఎదుగుతాం. అందులో ఎవరికీ అనుమానం అక్కరలేదు.
గతంలో అక్కడక్కడా చిన్నచిన్న పొరపాట్లు జరగడం వల్ల కొన్ని సీట్లు కోల్పోయాం. ఈసారి ఆ ప్రసక్తే ఉత్పన్నం కానివ్వం. అనేక కష్టాలు పడి, అవమానాలు ఎదుర్కొని, ఇవాళ ఈ స్థాయికి వచ్చాం. ప్రజల దీవెనలతో దీన్ని ఇలాగే కాపాడుకొంటూ ముందుకు సాగుదాం. మనల్ని కొట్టే శక్తి ఎవరికీ లేదు. దేశమే ఇవాళ తెలంగాణను అనుకరించే పరిస్థితిని సృష్టించుకొన్నాం.
దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో సంతోషం తొణికిసలాడుతున్నది. భవిష్యత్తులో అన్ని వర్గాలకు ఇది విస్తరించే అవకాశాలున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.