తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటి చేస్తున్న పార్టీ అయిన బీజేపీ నుంచి అధికార పార్టీ టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు తాము తోడుంటామంటూ యువత గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు.
ఈక్రమంలో జమ్మికుంట పట్టణ టీఆర్ఎస్ విద్యార్థి, యూత్ విభాగాలతో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.ఈ ప్రత్యేక సమావేశంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలపై వారికి దిశానిర్దేశం చేశారు.
అనంతరం దాదాపు రెండు వందల మంది బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. చేరిన వీరందరికి వారికి మంత్రి కొప్పుల ఈశ్వర్ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. యువకులంతా గడపగడపకూ తిరుగుతూ గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపుకోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు.