హుజురాబాద్ మండలం పోతిరెడ్డి పేట గ్రామానికి చెందిన బిజెపి యూత్ నాయకులు చందు రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఆదివారం వీణవంక మండల కేంద్రంలో జరిగిన ధూం ధామ్ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఇప్పటివరకు బీజేపీలో ఈటల రాజేందర్ కు మద్దతు గా యాక్టివ్ గా పనిచేసిన యూత్ నాయకులు చందు రెడ్డి శ్రీకాంత్ రెడ్డి.. టిఆర్ఎస్ నేత, హుజురాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్, సొల్లేటి కిషన్ రెడ్డి పింగళి (డాబా) రాజేందర్ రెడ్డి.. ఆధ్వర్యంలో గులాబీ పార్టీలో చేరడం.. మంత్రి హరీష్ రావు వారికి కండువా కప్పడం చర్చనీయాంశమైంది. వీరి చేరికతో గ్రామం మొత్తం టీఆర్ఎస్ పార్టీకి క్లీన్‌స్వీప్ గా మారింది.