టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆదివారం నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ ఎన్నిక నిర్వహణ కోసం రిటర్నింగ్ అధికారిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరించనున్నారు.
ఆయన ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణభవన్‌లో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదలచేస్తారు. అనంతరం నామినేషన్ల స్వీకరణ ప్రారంభిస్తారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ గ్రామ, మండల, పట్టణస్థాయిల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తయ్యింది. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పూర్తయిన తర్వాత జిల్లా, రాష్ట్ర కమిటీల నిర్మాణం చేపట్టనున్నారు.