దేశంలో కొత్తగా 14,146 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో కరోనా సోకినవారి సంఖ్య 3,40,67,719కు చేరింది. ఇందులో 3,34,19,749 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,95,846 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
మరో 4,52,124 మంది మహమ్మారివల్ల మరణించారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 19,788 మంది కరోనా నుంచి బయటపడగా, 144 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నది. గత 24 గంటల వ్యవధిలో 41,20,772 మందికి వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో మొత్తంగా 97,65,89,540 కరోనా డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. రాష్ట్రాలకు ఇప్పటివరకు 101.7 కోట్ల వ్యాక్సిన్ డోసులను సరఫరా చేశామని పేర్కొంది. అందులో 10.42 కోట్ల డోసులు రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది.