హూజూరాబాద్‌లో కారుజోరు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రతి గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో పార్టీలో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.
బుధవారం వీణవంక మండలం లోని మల్లన్న పల్లి గ్రామానికి చెందిన 15 మంది, రెడ్డిపల్లి గ్రామానికి చెందిన 25 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువకులు టీఆర్ఎస్‌లో చేరారు. వారికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.