హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో దివ్యాంగుడైన డి. మహేశ్ బుల్లెట్ బండెక్కి ప్రచారానికి వచ్చేత్తా..పా అంటూ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపుకోసం చేస్తున్న ఎన్నికల ప్రచారం పలువురిని ఆకర్శిస్తోంది. తన బుల్లెట్ బైక్‌కు ఫ్లెక్సీలు కట్టుకుని జనచైతన్యయాత్ర పేరుతో నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు చిత్రాలతో ఉన్న ప్లెక్సీలు బైక్‌కు మూడు వైపుల కట్టుకుని ఎక్కడ ఎన్నికల ప్రచారం జరిగితే అక్కడికి వెళ్లి తనదైన స్టైల్లో ప్రచారం చేస్తున్నాడు మహేశ్.
ఇంతకు టీఆర్ఎస్ పక్షాన ప్రచారం చేయడానికి కారణం ఏంటని అడిగితే దివ్యాంగుడైన తనకు నెలనెలా ఆసరా ఫించన్ అందిస్తున్న దేవుడు కేసీఆర్ అని, తను ఆయన వెంటే ఉంటానని అంటున్నాడు.కాగా బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మహేశ్‌ను వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.