మల్లన్న సాగర్ లోకి కాలేశ్వరం నీళ్లు 20 టీఎంసీల వరకు రావడంతో రైతు బంధు సమితి రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు ఎంపీటీసీల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ ఆధ్వర్యంలోమండల ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కాలేశ్వరం నీటితో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలేశ్వరం నీళ్లతో రైతుల కన్నీళ్ళు తుడిచిన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ముఖ్యమంత్రి గారి కృషితో బీడు భూములు సాగు భూములు ఐ రైతుల కళ్హల్లో ఆనందం కసిస్తుంది. మల్లన్న సాగర్ నిర్మాణం తో సాగునీటితో పాటు తాగునీరు అందివ్వడానికి కృషి చేస్తున్నారు. ఈ ప్రాంతం రాబోవు కాలంలో లో టూరిజం స్పాట్గా మారి కొంత మందికి ఉపాధి లభించే అవకాశాలున్నాయి.
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి నిత్యం రైతుల కోసం ఆలోచించి రైతుల కోసం రైతుబంధు, రైతు భీమ, 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి రైతన్నకు బాసటగా నిలిచి ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిరూపించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. రైతు బీమా పథకం పెట్టి అమలు చేస్తున్న ఏ కైక ప్రభుత్వం టిఆర్ ఎస్ ప్రభుత్వ మే. రైతుల వద్దకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెచ్చి రైతులు పండించిన పంట ను కొంటు రైతుల మనసులో నిలిచిపోయి డు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి లో దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు.
పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు, రైతాంగం పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.కార్యక్రమంలో సర్పంచులు బచ్చలి మైపాల్ అమ్ములు రమేష్ లక్ష్మీ రాజయ్య బొల్లోజు కిరణ్ కుమార్ మల్లమరి రవీందర్ కందూరి కనకవ్వ ఐలయ్య టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిట్యాల చిట్యాల సంతోష్ రెడ్డి కాశి రెడ్డి వీరు పాక రమేష్ రెడ్డి భూపాల్ రెడ్డి బాల బ్రహ్మం తిరుపతి రెడ్డి పూల రవీందర్ టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు సమ్మయ్య కృష్ణ గౌడ్ చరణ్ బచ్చలి రవీందర్ దేవి మైపాల్ తదితరులు పాల్గొన్నారు.