తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరిశ్ రావు గారు అన్నారు.బతుకమ్మ పండుగా సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావు గారు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోనే పూలను పూజించి, ప్రకృతి ని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణ లో ఉందన్నారు..
మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. ఈ తొమ్మిది రోజుల పాటు తీరొక్క పువ్వు తో బతుకమ్మ పండుగను ఆనందంగా జరుగపుకున్న ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు.. టి ఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు…
ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వ బతుకమ్మ కానుకగా ఆడపడుచులలు చీరల పంపిణీ చేస్తున్నామని చెప్పారు.. ఈ పండుగను ప్రజలందరు వేడుకగా , ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకున్నారు.. బతుకమ్మ పండుగ సందర్భంగా చెరువు ల వద్ద ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉంటు , చిన్నారులు జాగ్రత్తగా చూస్కోవాని గుర్తు చేశారు.. బతుకమ్మ పండుగ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని..ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు..