ఆపదలో ఉన్న వారికి అడగ్గానే అండగా నిలుస్తున్నారు మున్సిపల్, ఐటీశాఖా మంత్రి కేటీఆర్. సామాజిక మాధ్యమాల్లో ఆయనకు వస్తున్న విజ్ఞప్తులకు వెంటనే స్పందిస్తూ భరోసా ఇస్తున్నారు. వేడి పాలు ఒంటిపై పడి కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న చిన్నారితోపాటు బోన్‌క్యాన్సర్‌తో బాధపడుతు న్న బాలుడి వైద్యానికి సాయం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన గుండెబోయిన అశోక్, లక్ష్మి దంపతులకు కొడుకు కార్తీక్(11 నెలలు) ఉన్నాడు. వారం క్రితం వేడి పాలు పడి బాలుడి శరీరం కాలింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో రూ.2 లక్షలకు పైగా ఖర్చుచేసి చికిత్స చేయించా రు.మరో వారం రోజులు చికిత్స అందించాల్సి ఉందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలోఉన్నారు.
వీరి పరిస్థితిని ట్విట్టర్ ద్వారా తెలుసుకొన్న కేటీఆర్ వెంటనే స్పందించారు. బాలుడి చికిత్స చేయిస్తామ ని హామీ ఇచ్చారు. గంభీరావు పేటకు చెందిన మెట్టు సిద్ధ్దార్థ్ అనే బాలుడు బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. శనివారం కేటీఆర్ గంభీరావుపేటకు వచ్చిన సందర్భంగా సిద్దార్థ్ తల్లిదండ్రులు వెంకటనర్సు, రాణి తమ కొడుకు దయనీయస్థితిని వివరించారు. కేటీఆర్ సూచనతో స్థానిక నాయకుల సాయంతో సిద్ధార్థ్‌ను సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అడగ్గానే సాయం చేసిన మంత్రికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.