ఆన్‌లైన్‌లో మనం ఆర్డర్ చేసిన దానికి బదులుగా వేరే వస్తువులు వచ్చిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఘటనే వెలుగు చూసింది. ప్లిఫ్‌కార్ట్‌లో ఓ యువకుడు ఆపిల్ ఐఫోన్ 12ను ఆర్డర్ చేశాడు. కానీ ఆ ఫోన్‌కు బదులుగా రెండు నిర్మా సబ్బులు రావడంతో అతను విస్తుపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బిలియన్ డేస్ సేల్ కింద ఓ యువకుడు ప్లిఫ్‌కార్ట్‌లో రూ. 53 వేల విలువ చేసే ఆపిల్ ఐఫోన్ 12ను ఆర్డర్ చేశాడు. ఆర్డర్ యువకుడి వద్దకు రాగానే అతనికి అనుమానం వచ్చింది. ఇక ఓటీపీ చెప్పకుండానే ప్లిఫ్‌కార్ట్ డెలివరీ బాయ్ సమక్షంలోనే ఆ బాక్స్‌ను విప్పాడు. ఆ బాక్స్‌లో ఐఫోన్ 12కు బదులుగా.. రూ. 5 విలువ చేసే రెండు నిర్మా సబ్బులు ఉండటంతో షాక్‌కు గురయ్యారు.
దీంతో బాధిత వ్యక్తి ప్లిఫ్‌కార్ట్ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేశాడు. ఇది తమ తప్పేనని కొద్దిరోజులకు ప్లిఫ్‌కార్ట్ యాజమాన్యం అంగీకరించింది. ఇక ఆ యువకుడి డబ్బులను ప్లిఫ్‌కార్ట్ రీఫండ్ చేసింది. తన బ్యాంకు ఖాతాలో ఆ నగదు జమ అయినట్లు బాధిత యువకుడు తెలిపాడు.