హుజూరాబాద్ ఉప ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీఆర్‌ఎస్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతున్నది. సకల జనం టీఆర్‌ఎస్‌కు జై కొడుతున్నది. ఆదివారం హుజూరాబాద్‌లో మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన 60 మంది పాన్‌షాప్ యజమానులు.. గెల్లు గెలుపుకోసం కృషిచేస్తామని తెలిపారు. బీజేపీకి చెందిన 30 మంది యువకులు జమ్మికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
కమలాపూర్ మండలం గూడూరుకు చెందిన యువకులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఇల్లందకుంట మండలం మల్యాలకు చెందిన బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షుడు ఉడుత రాజుయాదవ్, సర్వ శంకర్‌యాదవ్ గొల్ల కురుమల హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోస్కుల శ్రీనివాస్‌యాదవ్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. హుజూరాబాద్ మండలం, పట్టణంలోని ఎరుకల కులస్థులు టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. హైదరాబాద్‌లోని కాచిగూడలో సమావేశమైన యాదవ, ముదిరాజ్, రజక, మేదరి, విద్యార్థి, బీసీ టీచర్ల సంఘం నాయకులు గెల్లు గెలుపు కోసం కృషిచేస్తామని ప్రకటించారు.