‘మా’ ఎన్నికలకు రాజకీయ పార్టీ సపోర్ట్ లేదనుకున్నా. కానీ ఇక్కడ కావాలంటున్నారు. రాజకీయ పార్టీలను ఇన్‌వాల్వ్ చేశారు. ఆ అవసరం ఉందంటున్నారు. అవసరం ఉన్నా నేను రాజకీయ పార్టీలను ఇందులోకి తీసుకురాను. అలా మొదలైంది అనుకున్నారు… అంతా అయిపోయింది అనుకుంటున్నారు. అసలు కథ ఇప్పుడే మొదలుకానుంది’’ అని ప్రకాశ్‌రాజ్ అన్నారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇకపై ‘మా’ కార్డు లేకపోతే స్టూడియోలోకి ఎంట్రీ లేదంటే నా దగ్గర ఇప్పుడు కార్డు లేదు.. నన్ను రానివ్వరా? అసోసియేషన్ ఒక్కటే సినిమా ఇండస్ట్రీ కాదు. ఇక్కడ చాలా శాఖలున్నాయి.
స్టేట్ ఎన్నికలకు, ‘మా’ ఎన్నికలకు పోలికేంటి? గతంలో నేను స్టేట్ ఎన్నికల్లో ఓడిపోయాను.. అంతమాత్రాన రాజకీయాలను వదిలేశానా? ఇప్పుడు నేను ‘మా’లో మెంబర్‌ను కాను అంతే.. తెలుగు సినిమాల్లో ఎప్పటికీ ఉంటా. మరోసారి పోటీ చేసే అవకాశం ఉన్నా.. ఇలాంటి అజెండాల మధ్య నేను పోటీ చేయలేను. రెండు ఎన్నికల్లో ఓడిపోయినా నేను నాలాగా ఉన్నా. మరో అవతారం ఎత్తలేదు’’ అని అన్నారు.