‘మా’ ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే మెగా బ్రదర్ నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
‘ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక ‘‘మా’’ అసోసియేషన్‌లో ‘‘నా’’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను… సెలవు’ అంటూ ట్వీట్ చేశారు.
48 గంటల్లో తన రాజీనామా లేఖను సిబ్బందితో మా కార్యాలయానికి పంపిస్తానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గతంలో నాగబాబు ‘మా’ అధ్యక్షుడిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఈ టర్మ్ ఎన్నికల్లో ఆయన ప్రకాశ్‌రాజ్‌కు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం ఆయన తీసుకున్న నిర్ణయం సినీ ఇండస్ర్టీలో హాట్ టాపిక్‌గా మారింది.