ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. తనపై భూకబ్జా ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే తప్పులు బయటపడుతాయనే రాజీనామా చేసి ఉప ఎన్నిక తెచ్చారు.
విభజన హామీలను తుంగలో తొక్కి బీజేపీ తెలంగాణను మోసం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్ పథకాలతో పేద, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలే లేవు అని ఎమ్మెల్యే ,ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై ఫైర్ అయ్యారు.