మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ప్రాథమిక సభ్యత్వానికి నటుడు ప్రకాశ్‌రాజ్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన మీడియాకు అధికారికంగా వెల్లడించారు. మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపును స్వాగతిస్తున్నానని తెలిపారు.
ఇతర సినీ పరిశ్రమల నుంచి వచ్చిన వారు మా ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా మార్గదర్శకాలు రూపొందిస్తామని మంచు విష్ణు ప్యానెల్ ఎన్నికలకు ముందు ప్రకటించింది. అలాంటి మా లో పని చేయడం తనకు ఇష్టం లేదని ప్రకాశ్‌రాజ్ చెప్పారు.
లోకల్, నాన్ లోకల్ అజెండా మధ్య పని చేయలేను అని ప్రకాశ్‌రాజ్ తేల్చిచెప్పారు. మా లో సభ్యత్వం లేకపోతే సినిమాల్లో అవకాశాలు ఇవ్వరా? అని ప్రశ్నించారు. కళాకారుడిగా నాకు ఆత్మగౌరవం ఉందన్నారు. 21 ఏండ్లుగా మాతో అనుబంధం ఉందన్నారు.