మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఈ నెల 10న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న విష్ణు మంచు తన ప్యానల్ సభ్యులతో కలసి గురువారం మ్యానిఫెస్టో విడుదల చేశారు. ‘‘మా’ తరపున యాప్ క్రియేట్ చేసి నటీనటులకు అవకాశాలు కల్పిస్తాం. ‘మా’ భవన నిర్మాణానికి ఎంత ఖర్చయినా నేను భరిస్తాను. రానున్న 15-20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తాం. దాన్ని నా హయాంలోనే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను’ అని తెలిపారు.
‘మా’ సభ్యత్వ రుసుం రూ. లక్ష నుండి రూ. 75 వేలకు తగ్గిస్తాం.
మోహన్ బాబు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో సినీ కళాకారుల పిల్లలకు 50 శాతం స్కాలర్‌షిప్ ఇప్పిస్తాం.
‘మా’లో ఉన్న ప్రతి సభ్యుడికి, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా అందజేస్తాం.
అర్హులైన ‘మా’ సభ్యుల పిల్లలకు కేజీ నుండి పీజీ వరకూ విద్యా సహాయం అందిస్తాం.
వృద్ధ కళాకారుల పెన్షన్ మొత్తాన్ని పెంచుతాం.