బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్లో రితేష్ దేశ్ముఖ్ జెనీలియా జంట ఒకటి. ఈ దంపతులు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు.అయితే జెనీలియా పెళ్లి తర్వాత సినిమాలు మానేసి ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. ఈ మధ్య తన భర్తతో కలిసి పలు షోలకు హాజరవుతుంది. ఆ మధ్య నటుడు అర్బాజ్ ఖాన్ హోస్ట్ చేస్తున్న డిజిటల్ షో ‘పించ్’ షో సీజన్ 2కి రితేశ్, జెనీలియా జంట అతిథులుగా వెళ్లారు.
ఇందులో వైరల్ అయిన వీడియోకి నెటిజన్ పెట్టిన కామెంట్ చదివి వినిపించారు అర్బాజ్. ‘సిగ్గు లేదా, వల్గర్ ఆంటీ. ఎప్పుడూ ఓవర్ యాక్టింగ్ చేస్తుంటావ్. ఇది నీ ముఖానికి సెట్ అవ్వదు’ అని కామెంట్ పెట్టాడు. దీనిపై రితేష్, జెనీలియా ఘాటుగానే స్పందించారు.ఇక తాజాగా అమితాబ్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్పతి 13’ షోకి ప్రత్యేక అతిథులుగా వచ్చారు. ఇందులో వీడియోని చూసి కంటతడి పెట్టుకున్నారు.