స్టార్ హీరోయిన్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇవ్వబోతున్నట్టు స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. ఆమె గురువారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘ముఖ్యమైన అనౌన్స్‌మెంట్ త్వరలో వస్తుంది.. వేచి ఉండండి’ అని పేర్కొన్నారు. దాంతో ఈ అనౌన్స్‌మెంట్ దేని గురించోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే, గత ఏడాది ప్రియుడు గౌతమ్ కిచ్లును 2020 అక్టోబర్ 30న వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో త్వరలో తను తల్లికాబోతున్న విషయాన్ని ప్రకటిచనున్నారా.. అని కొందరు మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్య కాజల్ ప్రగ్నెంట్ అని, త్వరలో సినిమాలకి గుడ్‌బై చెప్పబోతుందనే వార్తలు వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇదే విషయాన్ని కాజల్ అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ చేయబోతుందేమో చూడాలి. కాగా ఆమె మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. అలాగే నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గోస్ట్’లోనూ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల నిర్మాతగాను మారి ‘మను చరిత్ర’ అనే సినిమాను నిర్మిస్తున్నారు