టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకుల వ్యవహారం ఎంత చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్టోబర్ 2న తాము విడిపోతున్నట్టు ఈ జంట ప్రకటించగా, ఈ నిర్ణయంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నాగచైతన్య, సమంతలు విడిపోవటం నిజంగా దురదృష్టకరమని సినీ నటుడు, నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున విచారం వ్యక్తం చేశారు.
తాజాగా సమంత తండ్రి స్పందించారు. విడాకుల విషయం తెలిసి నా మైండ్ బ్లాక్ అయింది. సమంత అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకొని ఉంటుంది అని చెప్పారు. త్వరలోనే అన్ని పరిస్థితులు సద్దుమణుగుతాయని ఆశిస్తున్నట్టుగా వెల్లడించారు జోసెఫ్ ప్రభు.
కాగా, మూడేళ్ళ వివాహ బంధానికి వీడ్కోలు పలికిన ఈ జంట తమ సోషల్ మీడియాలో..భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం.. మా ఇద్దరి మధ్య దశాబ్ద కాల స్నేహబంధం ఉంది. ఇకపై కూడా ఆ స్నేహబంధం అలాగే కొనసాగుతుందని మేం ఆశిస్తున్నాం.. మేం మా జీవితాల్లో మరింత ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రైవసీని మాకు ఇవ్వండి అని సోషల్ మీడియా వేదికగా తెలియజేసిన విషయం తెలిసిందే.