అభివృద్ధి చేయటంలో ఇతరులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ “బ్రాండ్” అంబాసిడర్. 67 ఏళ్లలో ఏ నాయకుడు చేయలేని పనులు 7 ఏళ్లలో చేసి చూపించిన ఏకైక నాయకుడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎన్నో సంవత్సరాల నుంచి చేయలేని అభివృద్ధి పనులను ఆయన గడిచిన ఆరు సంవత్సరాల కాలంలో అత్యద్భుతంగా అభివృద్ధి చేసి ప్రజలకు అందించారు మౌలిక వసతులు కల్పించడంలో సఫలీకృతులయ్యారు మరియు ప్రజలు దీర్ఘకాలంగా పడుతున్న ఇబ్బందులను ఆయన తీర్చగలిగారు, ఆయన వేసిన అభివృద్ధి బాటలు భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగపడతాయి , ఆయన చేసిన అభివృద్ధిని ముందు తరాలు కీర్తించు కుంటాయి
ఖమ్మంను తెలంగాణ రాష్ట్రంలోనే ఒక బంగారు తునకగా ఆయన తీర్చిదిద్దారు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఓ ఇంటి పెద్దగా ప్రతి ఆడపిల్లకు అన్నగా ప్రతి ఇంటికి వెళ్లి చీర సారె లతో చెక్కులను ఇచ్చి వారికి అండగా నిలిచి ధైర్యం చెప్పారు, కరోనా సమయంలో పేదవారి ఇంటింటికి తిరిగి నిత్యావసర సరుకులు ఇచ్చారు, ఆయన పుట్టిన రోజు సందర్భంగా 10 వేల నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేశారు ఆయన సొంత నిధులతో రైతు వేదికను నిర్మించారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పువ్వాడ ఫౌండేషన్ ద్వారా ఎంత మందికి ఆర్థిక సహాయం మరియు కృత్రిమ అవయవాలు దానం ఉచిత వైద్యం అందించారు ఖమ్మంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు వివరిస్తే రాసుకోటనికి పేపర్లు చాలవు.. మంత్రి అజయ్ కుమార్ ..ఆత్మీయుడు.. అందరివాడు.. అజేయుడు
ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు కేబినెట్ మంత్రిగా అవకాశం కల్పించిన నాటి నుండి మంత్రి పువ్వాడ అజయ్ తన శాఖలో తెచ్చిన సంస్కరణలు ఇతర రాష్ట్రాల సైతం తెలంగాణను అనుసరిస్తున్నాయి అంటే దానికి ఈ యువనాయకుని నాయకత్వమే నిదర్శనం. నిజానికి ఒక రాష్ట్రంలో మంత్రిగా ఉన్న నాయకుడు పని తీరు చూసి స్ఫూర్తిగా తీసుకొని వారి రాష్ట్రంలో అమలు చేయటం అనటం తెలంగాణ ఖ్యాతిని గడించింది.
కొత్త సంస్కరణలు తీసుకురావటం ఒక్కటే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లా తో పాటు ఖమ్మం నగరాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకు ఎన్నో వినూత్నమైన ఆలోచనలను ఆచరణలో పెట్టిన ఘనత పువ్వాడ అజయ్ దే. ఆయన మదిలోంచి పుట్టిన ఒక్కో ఆలోచన ఇవ్వాళ పూర్తి స్థాయిలో జరిగిన అభివృద్దే రాష్ట్ర సాధన ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు విద్యార్థులతో కలిసి సకల జనుల సమ్మెలో పాల్గొనీ ఖమ్మం లో ఉద్యమానికి ఊపిరి పోశాడు. నూతన రాష్ట్రంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజు నుండే పువ్వాడ అజయ్ కార్యక్షేత్రంలోకి దూకారు. సమస్యలు స్వాగతం పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంతో రవాణమంత్రి అజయ్ కుమార్ పలుదఫాలుగా జరిపిన ఈ భేటీలు రవాణా శాఖ వర్గాల్లో ఒక నమ్మకాన్ని పాదుకొల్పాయి. ఫలితంగా ఆర్టీసీ, రవాణా శాఖ ప్రగతి తో పాటు లాభాల బాటలో కొనసాగుతున్నాయి సంస్థ కార్యకలాపాలను మరింతగా విస్తరించాయి.
ఇక 2020 మార్చి నుండి కొనసాగుతున్న కోవిడ్ విపత్తు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ అజయ్ విశ్వరూపం చూపాడనే చెప్పాలి. లాక్‌డౌన్ కాలాన్ని సదవకాశంగా మలుచుకోవాలని సూచించిన పువ్వాడ అజయ్ ఖమ్మం జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఎన్నో అభవృద్ధి పనులను చకచకా పూర్తిచేయించారు. కోవిడ్ వ్యాధి బారినపడి ప్రాణరక్షక మందులు, ఆక్సిజన్, ఆసుపత్రి బెడ్స్ దొరకని వేలమందికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆపద్బాంధువుడిగా నిలిచారు. రాత్రీ పగలూ తేడా లేకుండా ఆయన గొప్ప స్ఫూర్తిదాయకమైన పనితీరు కనబరిచారు. గత ఏడాది కోవిడ్ వ్యాధి నేపథ్యంలో ప్రజలకు ఉపయోగపడాలని ఆయన స్వయంగా ఆరు అంబులెన్స్‌లు బహూకరించారు, గొప్ప మనసుతో ఆక్సిజన్ ప్లాంట్ లు, పువ్వాడ ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు ఆయన పిలుపును అందుకుని ప్రజాప్రతినిధుల ఇతర నాయకులు, దాతలు ముందుకు వచ్చి ఆపదలో ఉన్నవారిని అండగా నిలిచారు.